నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
* గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో.. సర్వే నిలిచిందని.. పేదల కోసం ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. తదుపరి ప్రక్రియ చేపడతామని సమాధానమిచ్చిన కేంద్రమంత్రి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ( పీఎంఏవై -జీ ) పై కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. గత మూడేళ్లలో కేటాయించిన నిధుల వివరాలను అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై -జీ ) పథకం ద్వారా 2016 -17, – 18 ఆర్థిక సంవత్సరాల్లో 70,674 గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి విడతలో రూ.190. 79 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
* గత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదని, దీంతో ఆ ప్రభుత్వానికి నిధుల కేటాయింపు నిలిపివేసినట్లు తెలిపారు.
* ఆ ప్రభుత్వం.. 2018-19 వరకు సర్వేను కూడా నిర్వహించలేనందున.. అర్హులైన కుటుంబాలను గుర్తించలేకపోయారని చెప్పారు.
* ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పీఎంఏవై -జీ అమలుకు సముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అందుకే..అర్హులైన పేదలకు లబ్ధి కలిగేలా.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుందని.. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వివరించారు.