నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
మణుగూరు మండలంలోని వివిధ ఏజెన్సీ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు యదేచ్చగా, ఇష్ట నుసారముగా నిర్వహిస్తున్నారు. దానివల్ల పేద ఆదివాసి ప్రజలు, బడుగు బలహీన వర్గాల జనులు మధ్యమునకు బానిస అయ్యి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా కుదేలు అవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు కూడా మద్యం విక్రయిస్తున్నారు.
తద్వారా సత్ప్రవర్తన కోల్పోయి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు.
కేవలం మణుగూరులోని ప్రభుత్వం వారు టెండర్ల షాపులు కేటాయించినారు. వారు ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలి.
కానీ ఎం. అర్. పి ధర కంటే అదనంగా 20/- రూపాయలు బెల్టు షాపులు వారికి విక్రయిస్తున్నారు.
వారు లాభాపర్చని ద్యేయంగా 50/- రూపాయలు అదనంగాఎం. అర్. పి రేట్ల మీద గ్రామాలలో విక్రయిస్తున్నారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరుని నియంత్రించి టెండర్ షాపులు వద్దె కేవలం ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
లేనియెడల ఉన్నత అధికారులు దృష్టికి సమస్యను జఠిలం గురించి తీసుకెళ్లి మణుగూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాలలోని బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.