నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
అన్నపురెడ్డిపల్లి మండలం లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినారు.ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి బృహత్కర కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ ప్రజలపై తెలంగాణ అభివృద్ధిపై తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్న అని తెలియజేశారు అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కొరకు ఉండాలని మనస్పూర్తిగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.
కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









