మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్.
మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) ఫిబ్రవరి 13.
మెదక్ జిల్లావెల్దుర్తి మండలంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని, పది సంవత్సరాల్లో పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టు లోకి సాగునీరు విడుదల చేయడంతో 14 చెక్ డాములు నిండి కాళేశ్వరం నీరు పరవళ్ళు తొక్కుతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు గంగమ్మకు పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ కృషివల్లే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేడు హల్దీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులు నేడు మదన పడుతున్నారని రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు. కెసిఆర్ కృషి వల్ల హల్దీ ప్రాజెక్టులో 14 చెక్ డాం లలో నీరు నిండి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శాకారం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ తదితరులు పాల్గొన్నారు.









