స్పెషల్ ఎట్రాక్షన్ గా బర్త్డే కేక్…
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్ 1: టాలీవుడ్ నటుడు పుష్ప -2 తో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే, చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన్ని అందరూ అభిమానిస్తుంటారు, తాజాగా అశ్వారావుపేట మండలానికి చెందిన లెర్న్ ఫర్ లైఫ్ స్కూల్ (Learn for life school) లో 4 వ తరగతి చదువుతున్న 9 సంవత్సరముల బండారు నిహాల్ తన పుట్టినరోజు సందర్బంగా 5 కేజీ ల కేక్ పై తన ఫోటోతో పాటు అల్లుఅర్జున్ ఫోటో పెట్టించి అభిమానాన్ని చాటుకున్నాడు. అల్లు అర్జున్ ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ వారి స్వగృహం లో స్నేహితులు ముందు కట్ చేసి పంచారు. ఈ కేక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, బండారు నిహాల్ అభినందనలు తెలియజేసారు. తమ స్నేహితుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.









