+91 95819 05907

రైతు గోడు పట్టని ప్రభుత్వాలు…భాగం హేమంతరావు.

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి.
కొణిజర్ల :కష్టనష్టాలతో పంటలు పండించి పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుల గోడు పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు ఆరోపించారు. శనివారం కొనిజర్ల కళ్యాణ మండపంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దడి పిన్ని వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర సంఘం కొనిజర్ల మండలం మూడో మహ సభలో వారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారములోకి వచ్చాక రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు వ్యవసాయం మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన అందిస్తున్నాడని వారు విమర్శించారు.రాష్ట్రంలో పంటలు బీమా పథకం లేక రైతులు అంతా నష్టం జరిగి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక అమలు చేయడంలో ముసల కన్నీరు వలపోస్తున్నారని వారు పేర్కొన్నారు.పంట రుణమాఫీ రైతు రైతు భరోసా సంపూర్ణంగా అమలు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు రైతులకు మేలు జరగాలి అని ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంటల మద్దతు ధర గ్యారెంటీ చట్టాలు చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ వ్యవసాయం రైతులను చిన్న సూపు చూడటం వల్లే పల్లె రైతాంగం కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన సంగతి నీ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని వారు సూచించారు.వైరాలో 20వ తారీకు ఖమ్మం జిల్లా రైతు సంఘం మహాసభ జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి. రమేష్ కొండపర్తి గోవిందరావు, రాష్ట్ర రైతు సంఘం సీనియర్ నాయకులు అడప రామకోటయ్య,జమ్ముల జితేందర్ రెడ్డి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబాబు, తాటి వెంకటేశ్వరరావు,రైతు సంఘం మండల కార్యదర్శి తండు సోమయ్య,పెద్దమల రత్తయ్య,స్వర్ణ రమేష్, తోట టపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. మహాసభకు ముందుగా రైతు సంఘం జెండాను తాత బాబు పెద్దమల్ల రత్తాలు పతాకాన్ని ఆవిష్కరించారు.
రైతు సంఘం మండల అధ్యక్షుడిగా డేరంగుల లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా తాండు సోమయ్య తోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, 45 మంది కౌన్సిల్ సభ్యులను మహాసభ ఎన్నుకున్నది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !