.
నేటి గదర్ న్యూస్, చింతకాని మండల ప్రతినిధి, గుడిధి పిచ్చయ్యా.
అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఆవిర్భవించి 114 సంవత్సరాల అయిందని ఈ సందర్భంగా మార్చి 8న జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు పరువు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా సభలు ప్రదర్శనలు జరపాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి, జిల్లా సహాయ కార్యదర్శ ప్రతాపనేని శోభ పిలుపునిచ్చారు,
ఈరోజు (మంగళవారం) చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొల్లేటి వసంత అధ్యక్షతన సభ జరిగింది, ఈ సభలో పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఆవుల మంగతాయి, పి ఓ డబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, మాట్లాడుతూ మహిళలు తమ రక్తాన్ని చిందించి హక్కులు సాధించుకున్న రోజును అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా మార్చి 8ని జరపాలని వారన్నారు, ఒకవైపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల అయినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన చెందారు, మహిళలపై జరుగుతున్న అణిచివేత వివక్షత అసమానత్వానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం మహిళలపై అత్యాచారాలు పరువు హత్యలు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదని వారన్నారు బిల్కస్ భాను ఘటనకు బాధ్యులైన దోషులను బిజెపి వారు సత్కరించటం మహిళలపై వారికున్న గౌరవాన్ని చాటుకున్నారని వారన్నారు దేశంలో రాష్ట్రంలో పరువు హత్యలు జరుగుతున్న ఇటీవల ప్రేమ యుహాలు చేసుకున్న మహిళా కానిస్టేబుల్ ని తమ్ముడే హత్య చేయటం దుర్మార్గమైన చర్యని వారి ఆరోపించారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో బాలికలపై హత్యాచారం చేసి హత్యలు చేస్తున్న పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదని వారు ఆరోపించారు హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని గౌకేకలు వేస్తున్న బిజెపి వారు దైవ దర్శనానికి వెళ్లిన దంపతులు సేద తీరుతుండగా భర్త ఎదుటినే భార్యపై అఘాయిత్యం చేసి హత్య చేయడం నీతి భయమైన చర్యని వారన్నారు మహిళలపై నేరం క్షమించరాని పాపమని నేరగాళ్లకు కఠిన శిక్షలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరికలు చేయటమే తప్ప వారి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో నిత్యం మహిళలను అత్యంత దారుణంగా హత్యలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం ప్రజల నమ్మించడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని వారు అన్నారు చట్టాలు అధికారంలో ఉన్న వారికి చుట్టాలుగా మారాయి తప్ప మహిళలకు ఎటువంటి రక్షణ లేదని వారన్నారు కావున ఈనెల 8న ఖమ్మంలో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ ఈ సభలో కారుమంచి సుజాత షేక్ హుస్సేన్ బి జొన్నలగడ్డ వెంకట్రామమ్మ మొర్రి మేకల చుక్కమ్మ మొర్రిమేకల లింగమ్మ నాగేంద్ర మట్టి మంగతాయి చిర్రాభారతి, పడిశాల లక్ష్మి, ఉన్నం ఉమా, పున్నం చిట్టి, తదితరులు పాల్గొన్నారు.