*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు, రైతులకు రెండో పంట లాంటి తునికాకు టెండర్లు నిర్వహించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం సరైంది కాదని గుండాల మాజీ సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం గుండాల రేంజర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తునికాకు టెండర్లు నిర్వహించను పక్షంలో అటవీ శాఖ ద్వారా తునికాకు సేకరణ ప్రారంభించాలని తునికాకు సేకరణ సందర్భంలో జరిగే ప్రమాదాలకు ఇన్సూరెన్స్ కల్పించాలని అన్నారు. 50 ఆకుల పట్టాకు ఐదు రూపాయలు చెల్లించాలని ఇతర పనులకు 30 శాతం చెల్లించాలని కోరారు తునికాకు సేకరణ ద్వారా లక్షల రూపాయలు ఆదాయం వస్తున్న ప్రభుత్వం తునికాకు టెండర్లు నిర్వహించడంలో విఫలమైందని అన్నారు. తక్షణమే తునికకు టెండర్లు నిర్వహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గుండాల మాజీ ఉప సర్పంచ్ ఉపేందర్ , ఈసం కృష్ణ. పెంటయ్య యాసారపు వెంకన్న. లాలు నరేష్ పాయం నాగేశ్వరరావు. మాదాల అశోక్ , తదితరులు పాల్గొన్నారు
