+91 95819 05907

నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు :మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

కెసిఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు.

నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.

నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.

నాడు అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు.

నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు.

తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్ కు, కెసిఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలి.ఓ

ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారు?

కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి.

ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడం.

దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారు.

ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృధా అన్నరు. అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారు.

కానీ కెసిఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ_పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారు.

ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసిఆర్ ఏ కారణం.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గం.

ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనబై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు.

సీతారామా ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

2023 డిసెంబర్-7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారు.

వృథా ప్రాజెక్టు అన్నారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. డిపిఆర్ లేదన్నారు.

ఒకే ఒక్కసారి మంత్రులు బృందం పర్యటించి, 2024 ఆగస్టు-15వ తేదీన మూడు పంపు హౌసులను ఏకకాలం స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారు.

కేసీఆర్ మొక్కనోని దీక్షముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయారు. బీఆరె్ఎస్ ప్రభుత్వ కష్టం, నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడింది. 60 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పాలనకు, పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనకు తేడాను సుస్ఫష్టం చేసింది.

అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పదిలక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే… దాని వెనుక బి ఆర్ ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అబివృద్దే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్.

అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం, సీతరామా ఎత్తిపోతల ప్రాజెక్టులు.

ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులై బాసిళ్లుతాయి. కేసీఆర్ గారి కృషి దశదిశలా చాటుతాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !