+91 95819 05907

దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా కృషి….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ధివ్యాంగులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.

యు.డి.ఐ.డి. పొందే విధానంపై దివ్యాంగులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్.
జిల్లాలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా కృషి చేస్తున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు (UDID) పొందే విధానంపై దివ్యాంగులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ. దివ్యాంగులందరికి హక్కులు కల్పించే చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ను పూర్తి స్థాయిలో తెలుసుకొని చర్చ పెట్టుకోవాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ర్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో దివ్యాంగులకు రిజర్వేషన్ లబ్ది చేకూర్చడం జరుగుతుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉపాధి శాఖ సమన్వయంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఎంప్లాయి మెంట్ ఎక్స్ చెంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్ చెంజ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న వివిధ ఉపాధి అవకాశాలలో దివ్యాంగులకు అనువైన ఉపాధి లభించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నూతనంగా నియమించబడే డేటాఎంట్రీ ఆపరేటర్ లలో దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
దివ్యాంగులు సమాజంలో గౌరవ ప్రదమైన జీవనం గడిపే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. దివ్యాంగులను ఎగతాళి చేసిన, చిన్న చూపు చూసిన, దాడులు చేసినా చట్ట ప్రకారం శిక్షకు అర్హులు అవుతారని, వెంటనే సంబంధిత మండల తహసిల్దార్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో దివ్యాంగుల సమన్వయ కమిటీని పునరుద్ధరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా దివ్యాంగులకు ఉన్న వాట్సాప్ గ్రూపు లలో ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అన్నారు.
ప్రతి నెలా దివ్యాంగులతో సమావేశాలు నిర్వహించి ఫిర్యాదుల పరిష్కార పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించుకోవాలని అన్నారు.ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసే స్త్రీ టీ షాపు లలో దివ్యాంగ మహిళలకు 50 శాతం కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. అక్టోబర్ 31, 2023 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపి యూ.డి‌.ఐ.డి కార్డులను సిద్దం చేశామని, వీటిని త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు. 1 నవంబర్, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు నూతనంగా జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వివరాలను పంపి వారికి కూడా యూ.డి.ఐ.డీ కార్డులు అందేలా చర్యలు చేపట్టామని అన్నారు.
నూతనంగా యూ.డి.ఐ.డి. కార్డుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఫోన్ నెంబర్, అడ్రస్ సరిగా నమోదు చేయాలని, యూ.డి.ఐ.డి. కార్డులు నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరుతాయని అన్నారు. నూతనంగా యూ.డి.ఐ.డి. కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రి లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని, నిర్దారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూ.డి.ఐ.డి. కార్డు జనరెట్ చేస్తామని అన్నారు. యూ.డి.ఐ.డి. పోర్టల్ లో కొత్త వ్యాధులను కూడా చేర్చడం జరిగిందని అన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మన ఫోన్ కు మెడికల్ క్యాంపు సమాచారం మెసెజ్ ద్వారా అందుతుందని, ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులకు నేరుగా ఫోన్ చేసి ఏ ఏ పత్రాలు తీసుకొని రావాలోసమాచారం అందించేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.మెడికల్ క్యాంపులో వైకల్యం నిర్ధారించిన తర్వాత సదరు వివరాలను వైద్యులచే ధృవీకరించి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసి యూ.డి.ఐ.డి. కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఖమ్మం జిల్లాలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్ లలో కొన్నింటిలో వైద్యుల సంతకాలు మిస్ కావడం వల్ల దివ్యాంగులు ఇబ్బందులు గురవుతున్నారని తెలుపగా, వాటికి కూడా యూ.డి.ఐ.డి. కార్డు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.ఖమ్మం జిల్లాలోని షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం తప్పనిసరిగా ర్యాంప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు.సదరం సర్టిఫికెట్లలో ఉన్న తప్పుల సవరణకు అవకాశం మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.వైకల్య నిర్ధారణ అంశంలో పరికరాలను ఉపయోగించి సరైన సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లకు బదులుగా యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందని, ఇవి ఇతర రాష్ట్రాలలో కూడా ఉపయోగపడతాయని అన్నారు. నూతనంగా యూ.డి.ఐ.డి. కార్డుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూ.డి.ఐ.డి. జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ అవగాహన సదస్సులో డిఆర్వో ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డిఇఓ సోమశేఖర శర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !