రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పి.అంగన్వాడి 7,3,8 సెంటర్లలో భాగంగా మహిళలకు చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారిక కేంద్రం మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ నాగమణి మాట్లాడుతూ బాల్యవివాహాలు బాలికలపై అత్యాచారాలు జెండర్ ఈ క్వాలిటీ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉండాలని,భేటీ బచావో బేటి పడావో అనే అంశంపై ఆడపిల్లలను చదివించు చదువుతోపాటు సమాన హక్కులు కల్పించాలని వాటి గురించి వివరించారు.సఖి సేవలు వరకట్న వేధింపులు లైంగిక వేధింపులు గురించి డిజేబుల్ సేవల గురించి మహిళలకు వివరించారు.పోక్స్ యాక్ట్ గురించి అత్యవసర సమయంలో మహిళలు బాలికలు ఈ టోల్ ఫ్రీ నెంబర్స్181,1098,100 అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాలని,మరియు పీసీ పిఎన్డిటీ యాక్ట్ గురించి,స్కానింగ్ డైనోసార్ సెంటర్స్ గురించి వివరించారు.మహిళల అక్రమ రవాణా గురించి ఆన్ సేఫ్ టచ్ గురించి వివరించారు.రమేష్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి,సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.మత్తు పదార్థాల నిర్మూలన సమాజంలో యువత మహిళలు మత్తు పదార్థాలకు గురికాకుండా ఉండేందుకు వాటి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత టీమ్ జెండర్ స్పెషలిస్ట్ నాగమణి,మరియు ఫైనాన్షియల్ లెటర్స్ ఎస్ఎఫ్ఎల్ రమేష్ మరియు, అంగన్వాడి టీచర్లు శ్యామల సుజాత పద్మ మరియు తల్లిదండ్రులు మహిళలు పాల్గొన్నారు.
