రెండు జిల్లాల విపిఎల్-4 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ రాజేందర్*
నేటి గదర్ కరకగూడెం:యువత గ్రామీణ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు.
శుక్రవారం కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ముసలమ్మ తల్లి జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు రెండు జిల్లాల విపిఎల్-4 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను కరకగూడెం ఎస్ఐ రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతు ఏజెన్సీలో ఆణిముత్యాలు లాంటి క్రీడాకారులు ఉన్నారని,వారిలోని ప్రతిభను వెలికి తీయాలంటే గ్రామంలో అనేక రకాల క్రీడాలు నిర్వహించాలని అన్నారు.అలాగే యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుల పట్ల శ్రద్ధ వహించి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు.క్రీడలను నిర్వహిస్తున్న టోర్నమెంట్ నిర్వాహకులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సాయి క్రిష్ణ ,మాజీ ఉపసర్పంచ్ బోడ ప్రశాంత్,ముసలమ్మ తల్లి జాతర నిర్వాహకులు వెంకట అప్పారావు,నాగేశ్వరరావు,సూరయ్య బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,కుంజ కృష్ణ,సుతారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
