ఖమ్మం నగరంలోని విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వేదికగా సమర్తనం ట్రస్ట్ మరియు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ ఉబ్బలపల్లి నిరోష పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరోష మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నేటి సమాజంలో మహిళలకు చదువు, ఉద్యోగం చాలా అవసరమని మహిళలు మగవారితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారని రైళ్ళు నడపడంతో పాటు అంతరిక్షాన్ని సైతం తాకుతున్నారని. మహిళలకు చట్టాలపైన అవగాహన ఉండాలన్నారు. ధైర్య సాహసాలతో ఎలాంటి కఠిన పరిస్థితులనైన ఎదుర్కోవాలని అన్నారు. అనంతరం పెయింటింగ్, వ్యాసరచన పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన వారికి షీల్డ్ మరియు సర్టిఫికేట్ అందచేసారు.
ఈ కార్యక్రమంలో అమరగాని వెంకన్న(పోలీస్ వెంకన్న) సుదర్శన్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిరెక్క ఉమా శంకర్, కోశాధికారి అవులూరి సౌమ్య, వెర్సటైల్ ఐటి సొల్యూషన్స్ మేనేజర్ కల్లేపు అఖిల, టి.జి.వై.ఏ సభ్యులు నెమలికొండ వంశీ, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
