రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు గ్రామానికి చెందిన దండు అశోక్ ఈరోజు గుండెపోటుతో మరణించడం జరిగింది.దామర చెరువు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గ్రామ బిఆర్ఎస్ నాయకుల ద్వారా దండు అశోక్ అంత్యక్రియలకు 5000/- రూపాయలు అర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీల రాజు,కర్రోల్ల నర్సింలు,సత్తయ్య,సందీప్,
సిద్దరములు,జె.రాజు,మల్లేశం బి.శ్రీనివాస్ ప్రభాకర్ పి.బాలరాజ్ ,డి.శ్రీనివాస్,డి.స్వామి,కె.ఆంజనేయులు టి.డానియల్ గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Views: 216









