రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన బైరం శంకర్ కు గత 15 రోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ జరిగింది.ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆదివారం నాడు శంకర్ కుటుంబాన్ని పరామర్శించి చికిత్స నిమిత్తం 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.అదేవిధంగా పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన విజయ్ బ్రెయిన్ స్ట్రోక్ తో ఇటీవల మరణించడం జరిగింది.బాధితుల కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000/- రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం బస్తాను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జి.శ్రీనివాస్ నాయక్.అంబేద్కర్ యూత్ క్లబ్ సభ్యులు. గావు సురేందర్.టంకరి వెంకట్,నాగ ప్రశాంత్.శ్రీకాంత్ గిరి,మహేష్ బాబు అసాది రవి,స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 180









