నేటి గద్దర్ న్యూస్, గుండాల : వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు గుండాల మండలం వాసవి క్లబ్ గ్రీన్ఫీల్డ్ అధ్యక్షులు మానాల శ్రవణ్ కుమార్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కమిటీ సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి మానాల ఉపేందర్, ట్రెజరర్ గౌరీశెట్టి శరత్ కుమార్, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, తవిడిశెట్టి నాగరాజు, తవిడిశెట్టి రాంబాబు, శ్రీరంగం శ్రీనివాస్, అయిత శ్రీశైలం, పూజిత్, భరత్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 232









