అనారోగ్య సమస్య, బాగోలేని ఆర్థిక పరిస్థితి సహాయం కోసం ఎదురుచూస్తున్న లవుడియా. శాంతి కి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి సహాయం
నేటి గదర్ న్యూస్,వైరా( జూలూరుపాడు), మార్చి 16: జూలూరు పాడు మండలం లోని భోజ్య తండా గ్రామ పంచాయతీ. పుల్లూడు తండా గ్రామానికి చెందిన లవుడియా. శాంతి అనారోగ్యంతో మంచానికి పరిమితమై కదల్లేని స్థితిలో ఉన్నది తను ఇంట్లో నుండి బయటికి రావాలి అంటే ఇద్దరు సహాయం కావాలి ఇంట్లోకి వెళ్లాలి అన్న ఇద్దరు సహాయం కావాలి అలాంటి పరిస్థితిలో ఉన్న లవ్వుడియా శాంతికి నలుగురు సంతానం మొదటి సంతానానికి గుండెకు రంధ్రం ఉన్నది రెండో పాప మూడో పాప చిన్న వారు నాలుగో బాబు వారి కంటే చిన్నవాడు కదలేని పరిస్థితిలో ఉన్న తాను కల్మషం లేని మనసుతో ఉన్న పిల్లలు చేతిలో డబ్బులు లేవు ఇంట్లో బియ్యం లేవు అలాంటి దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజు ఇంటర్నేషనల్ మహిళా చైర్మన్ అంజలి రెడ్డి వారి సహకారంతో తంబర్ల నరసింహారావు ఆధ్వర్యంలో పాతక కేజీల బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినదని వారు తెలియజేశారు.









