★ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెళ్లి.
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పై మందమర్రి ఏరియా వెళుతున్న పే కె ఓ.సి 2 ప్రాజెక్ట్ మేనేజర్ దండమూరి రాంబాబు ను మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు,నాయకులు ఆదివారం నాడు పూల మాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక ద్వారా మిఠాయి అందించి శుభాకాంక్షలు తెలిపారు… ఈ సందర్భంగా నాగెల్లి మాట్లాడుతూ అడిషనల్ మేనేజర్ హోదాలో అర్. జి 3 ఏరియా ఓ. సి 2 నుంచి బదిలీ పై2017 వ సంవత్సరంలో మణుగూరు ఏరియా ఓ . సి 2 కు వచ్చిన రాంబాబు విధుల పట్ల అంకితభావం, చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ పై స్థాయి అధికారుల మన్ననలు పొందుతూ మేనేజర్ గా, డి. జి యం లాంటి అనేక పదోన్నతులు పొంది నేడు ప్రాజెక్ట్ ఆఫీసర్ పదోన్నతితో బదిలీ పై వెళ్ళడం స్ఫూర్తిదాయకం తెలిపారు.. 8 సంవత్సరాల పై బడి మణుగూరు ఏరియా ప్రకాశం ఖని 2 కు ఆయన అందించిన విశిష్టమైన సేవలు వారంత కొనియాడారు… నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధన,సంస్ధ ఖ్యాతి ఓ . సి 2 ఉద్యోగులను సమన్వయ పరచి ప్రమాదరాహిత లక్ష్యాలు సాధించడం లో అయన పాత్ర మరువలేనిదని తెలిపారు. వజ్ర సంకల్పం క్రమశిక్షణ, పట్టుదల ద్వారా కష్టించి పని చేస్తే ఎలాంటి కఠినమైన లక్ష్యాలనైన సునాయాసంగా సాధించవచ్చని నిరూపించిన అధికారి రాంబాబు ఆని తెలిపారు. పనుల పట్ల నిబద్ధత, అంకితభావం, ఓర్పు, నేర్పు, దక్షితత,క్రమశిక్షణ, నిజాయితీ ఆయనలో ఉన్న సద్గుణాలు అని తెలిపారు.భవిష్యత్తు కాలంలో మరింత ఉన్నతమైన పదోన్నతులు అధిరోహించి సంస్థ ప్రగతి కి, కార్మిక సంక్షేమానికి చేయూత అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు… ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్,రాజ్ కుమార్, రాము, గఫూర్, వినోద్, దేవకాంత్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు









