+91 95819 05907

DSP జవహర్ లాల్ కు పలువురి ఘన నివాళి

జవహర్ లాల్ కు పలువురి ఘన నివాళి
ఖమ్మం మార్చి 16 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మేడ్చల్ జిల్లా పోలీస్ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ , డిఎస్పి , వైరా మాజీ ఎమ్మెల్యే సోదరుడు జవహర్ లాల్ కర్మ , సంతాప సభ లో పాల్గొన్న పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం చిన్న ఈర్లపూడి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సమక్షంలో జరిగిన కర్మ , సంతాప సభ లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , వీరనరీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రవీంద్ర నాయక్ లు పాల్గొని , ఘనంగా నివాళులు అర్పించారు. కొద్దిసేపు జవహర్ లాల్ చిత్రపటం ఎదుట శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సేవలను కొనియాడారు. మృతుడు జవహర్ లాల్ సోదరులు వైరా మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ , ఎఫ్ సి ఐ మేనేజర్ సుందర్ లాల్ , కుటుంబ సభ్యులకు సంతాపం , సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి స్పందన, మీడియా ఇన్ఛార్జి త్రివేణి ,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి ,ఉపాధ్యక్షురాలు విజయ, గౌరవ సలహాదారులు కే .లక్ష్మి ,పి .జ్యోతి లు పాల్గొని ,నివాళులు అర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !