ఖమ్మం మార్చి 16 :
జమాతే ఇస్లామీ హింద్ ఇందిరానగర్ శాఖ ఆధ్వర్యంలో రఘునాధపాలెం లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు ప్యా డ్స్ , స్కేల్స్ ,పెన్సిల్ ఇతర స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ ఇంద్రానగర్ శాఖ అధ్యక్షులు నిజాముద్దీన్ మాట్లాడుతూ విద్యార్థినులు మంచిగా చదివి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు .అదే విధంగా ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ధైర్యంగా ఉండి పరీక్షలు రాయాలన్నారు. ఐట రీజినల్ సెక్రెటరీ మొహమ్మద్ ముజీబ్ మాట్లాడుతూ పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, అదేవిధంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల మెలుకువలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అరుణకుమారి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు









