+91 95819 05907

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ప్రయత్నం విరమించుకోవాలి

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ప్రయత్నం విరమించుకోవాలి
– వర్గీకరణ వల్ల షెడ్యూల్ కులాల మనుగడకే ముప్పు…
– ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి…
– ఎస్సీ వర్గీకరణను అశాస్త్రీయంగా చేస్తే సహించం….
– జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు… పిల్లి సుధాకర్.

ఇల్లందు, మార్చి 16, ( ) : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలనే ప్రయత్నం మానుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడం అశాస్త్రీయమని,దీనిపై పాలకులు, పార్టీలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.వర్గీకరణ వల్ల షెడ్యూల్ కులాల మనగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలనే పాలకుల ప్రయత్నం ఉపసంహరించుకొని, ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ పెంచేలా ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే వర్గీకరణ మార్గం సులువు కానున్నదని అన్నారు.వర్గీకరణ పై అసెంబ్లీలో చట్టబద్ధత చేయాలని ప్రయత్నిస్తే ప్రజా కోర్టులో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.పాలకులు అత్యుత్సాహంతో ఎస్సీ వర్గీకరణ ను అసెంబ్లీలో చట్టం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా మాలమహానాడు కార్యకర్తలు ప్రత్యక్ష పోరాటాలకు, న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇల్లందు మండల కేంద్రానికి చెందిన మాల మహానాడు నాయకుడు బేతమల్ల రవితేజ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం, అతని దశదినకర్మ నేడు జరగనున్నడంతో మాల మహానాడు నాయకులు మానవతా దృక్పథంతో చలించి వితరణ చేసిన 50 కేజీల బియ్యం, కిరాణా సరుకులను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్,జిల్లా మహిళా కార్యదర్శి మద్దెటి జయ, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ధారా చిరంజీవి,ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు కాలే పుల్లయ్య, జ్ఞాన సుందరం, వేమూరి సాల్మన్ రాజు,సందా ప్రవీణ్ కుమార్, గుర్రం బిక్షపతి, చెలిమెల బాబురావు, మలిపెద్ది కమలాకర్, చెన్నుమల్ల రామకృష్ణ, జిల్లా నాయకులు శనగ ప్రభాకర్, జీవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !