ఈ మధ్యకాలంలో చూసిన మంచి మూవీ కోర్ట్.. చట్టాలపై యువతకు అవగాహన ఉండాలని చెబుతూనే, pocso act ఎలా misuse అవుతుందో క్లియర్ గా చూపించారు.. అనవసర సీన్స్ ఎక్కడా కనబడలేదు.. చాలా రిఫ్రెషింగ్ గా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష వర్ధన్, సాయి కుమార్ చక్కగా నటించారు.. ముఖ్యంగా మంగపతి క్యారెక్టర్ లో శివాజీ చెలరేగిపోయాడు..
కోర్ట్ రూమ్ వాదనల్లో సినిమాటిక్ లిబర్టీ ఉన్నా, మాస్ ఆడియన్స్ కి కూడా అర్ధమయ్యేలా తీయగలగడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు.. అక్కడక్కడా కథనం నెమ్మదించిన ఫీల్ కలిగినా సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు.. ఈ సినిమా నచ్చకుంటే తన హిట్ 3 సినిమా చూడొద్దని ఓపెన్ గా నిర్మాత నాని ప్రకటించడం వెనుక ఉన్న మర్మం సినిమా చూసాక అర్థం అయింది..వీలైతే ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని మంచి మూవీస్ మేకర్స్ నుండి రావొచ్చు.. కాబట్టి తప్పకుండా థియేటర్లలో చూసి ఎంకరేజ్ చేయండి..
– Kiran’s Creation