+91 95819 05907

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

నేటి గదర్ మెదక్ ప్రతినిధి (భూపాల్) మార్చి 17.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను నమ్మించి మోసం చేస్తుందని సోమవారం నుండి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటదన్నారు. వర్గీకరణపై ఇచ్చిన మాటను అమలు చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో అవసరమైతే గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ 3 పరీక్షల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అమలు చేస్తామని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాని మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఏబిసిడి కాకుండా ఏబిసి గా ఎందుకు విభజించారు. మాదిగ మాదిగ ఉపకులాలకు తెలిపాల్సిన విషయం ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ మరియు ఉప కులాల నాయకులకు న్యాయం చేయాలని కోరారు. మాసాయిపేట మండల కేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షలను మెదక్ జిల్లా జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసాయిపేట భూపాల్ మాదిగ ప్రారంభించగా మాసాయిపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభం అయ్యాయి. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వినోద్ మాదిగ, మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి చిన్నోళ్ల భాస్కర్ మాదిగ, అచ్చంపేట గ్రామ అధ్యక్షులు బోడ వేణు మాదిగ, పోతనపల్లి గ్రామ అధ్యక్షులు మహేష్ మాదిగ, చెట్ల తిమ్మయ్య పల్లి గ్రామ అధ్యక్షులు బాబు మాదిగ, అక్కింపేట మొగిలిగుండ్ల శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు, నాగరాజు మాదిగ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !