+91 95819 05907

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు

*అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు.* కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. *మృతి చెందిన వారిని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లి వాసులుగా గుర్తించారు.* మృతులు *మాజీ సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి (35), కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా* గుర్తించారు. *ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, 9 నెలల చిన్న కుమారుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం తెలిసింది.* ఈ ఘటనతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా ఫ్లోరిడాలో ఈ ప్రమాదం ఉదయం 3 గంటలకు జరిగింది.

*ట్రక్కును ఢీ కొనడంతోనే :* ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. కారు, ట్రక్కును బలంగా ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి రోహిత్ రెడ్డి అమెరికాలో నివాసం ఉంటున్నారని సన్నిహితులు తెలిపారు. మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడం ఇబ్బందికరంగా ఉండడంతో కుటుంబ సభ్యులే మధ్యాహ్నం అమెరికాకు బయలుదేరినట్లు తెలిపారు. మృతదేహాలు నుజ్జునుజ్జు కావడం వల్ల దహన సంస్కారాలు అమెరికాలోనే చేస్తున్నట్లు వెల్లడించారు.
*పవిత్ర దేవి మోహన్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రగతి రెడ్డి చిన్న కుమార్తె కాగా, పెద్ద కుమార్తె కూడా అమెరికాలోనే ఉంటున్నారు* . ఆదివారం కావడంతో ఇద్దరు కుమార్తెలు కుటుంబ సభ్యులు విందు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !