రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 17:- ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న న్యూ బొలెరో కారులో వస్తుండగా రామాయంపేట మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం వెనుక జాతీయ రహదారిపై డివైడర్ కు కారు ఢీకొనగా టైరు పేలిపోయింది.దీంతో పల్టీలు కొట్టి కారు రోడ్డు కిందికి దూసుకుపోయింది.దాంతో కారు ముందు భాగము డివైడర్ కు ఢీకొనడంతో నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో తన తోటి సోదరుడు హరి కి తన కు ఏలాంటి గాయాలు కాలేదని తెలిపారు.ఈ ప్రమాదం తృటిలో తప్పిందని యజమాని పి మహేష్ తెలిపారు.ఈ మేరకు రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అయన తెలిపారు.
Post Views: 200









