రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 17:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటపూర్ గ్రామానికి చెందిన పుర్ర రాములు తండ్రి కిషన్ వయస్సు (36) ఈనెల 11న మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగగా తదుపరి అతన్ని చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రి హైదరాబాదుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి సమయంలో మరణించాడు.మృతుడు ఆర్థిక కారణాల వలన జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు.
Post Views: 183









