రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 17 :- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామంలో మాసాయిపేట బాగ్య భర్త పురుషోత్తం తండ్రి రాజయ్య ఆదివారం రోజు రాత్రి అందాజా 10 గంటలకు అందరు ఇంట్లో భోజనం చేసిన అనంతరం భర్త పురుషోత్తం తండ్రి రాజయ్య వయస్సు (34) తను పొలానికి నీళ్లు పారబెట్టుట గురించి పొలానికి వెళ్లి తిరిగి రాకపోయేసరికి వారు కుటుంబీకులతో వెళ్లి పొలం వద్ద వెతకగా పొలంలో ఉన్న చింత చెట్టుకు తాడుతో ఊరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించాలని తెలిపారు.మృతునికి ఇదివరకు కడుపునొప్పి మరియు ఆర్థిక సమస్యల వలన జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు.









