నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 30: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట మండలం లో వినాయక పురం గ్రామం లో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది (తెలుగు) సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలతో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆలయ పరిసరాలలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మించే మినీ ఫంక్షన్ హాల్ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సూర్య ప్రకాష్, చైర్మన్ నరాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
