*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మెట్ల పై నుండి జారిపడి డైలీ వర్కర్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మామ కన్ను ఆశ్రమ పాఠశాలలో డైలీ వేజ్ వర్కర్ గా కాచనపల్లి గ్రామానికి చెందిన ఫోన్ ఎం సతీష్ కుమార్ పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పై అంతస్తు నుండి కిందికి దిగి వస్తున్న క్రమంలో మెట్లపై జారి పడటంతో గమనించిన విద్యార్థులు వార్డెన్ కు సమాచారం అందించారు సతీష్ కుమార్ ను గుండాల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు వార్డెన్ సనప రంజిత్ ఫిర్యాదు మేరకు ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు
Post Views: 359









