రామాయంపేట, (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 31:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం 21వ వార్షికోత్సవ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ తేదీన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమానికి హాజరుకావాలని పట్టణ సర్కిల్ కార్యాలయంలో రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 88