ఎంఆర్పిఎస్ చేగుంట మండల అధ్యక్షులు
కొలుపుల రామస్వామి అధికారులకు విజ్ఞప్తి.
సుప్రీంకోర్టు చెట్లను నరకడం అంటే మనుషులను చంపినతో పని అని స్పందించిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ దీనిపై స్పందించిన ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెట్ల విషయంలో మనిషిని చంపినంత పని అని తీర్పు ఇవ్వడం మంచి విషయమే కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నంత అధికారులు జోస్యం చూస్తున్నారా అంటూ మండిపడ్డారు. రోడ్డు అంచుకు కరెంటు స్తంభాలు వేయడం ఆ స్తంభాల వైర్ల కింద చెట్లు నాటడం ఆ చెట్లను నరకడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది అని ఇంత జరుగుతున్న మరి ఇది ప్రభుత్వ ఉన్నంత అధికారులకు తెలియని విషయం కాదని తెలిసిన ప్రజా దానాన్ని వృధా ఖర్చు పెట్టడంతో పాటు చెట్లను నరకడం జరుగుతూనే ఉంది అని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉన్నంత అధికారులకు నేను ఇచ్చే సలహా ఒకటి రోడ్డుకు అంచున కరెంటు స్తంభాలు వేరే ఏ విధమైన స్తంభాలైనా నాటకూడదు రోడ్డు అంచు నుండి దాదాపు 50 అడుగుల అవతల స్తంభాలను నాటాలి అప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటిన ఎలాంటి ప్రమాదం ఉండదు నరకడం జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని అన్నారు. కానీ నేను చెప్పే సలహా పాటిస్తే చెట్లకు కరెంటు స్తంభాలకు ఎలాంటి ప్రమాదం జరగదు అని అధికారులు తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.