?భద్రాద్రి ఆణిముత్యం-యువ హీరో రోషన్ని అభినందించిన టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్
భద్రాచలం నివాసి *రషీద్* తనయుడు *హీరో రోషన్* చలనచిత్ర రంగంలో వడివడిగా అడుగులేస్తూ అనేక చిత్రాల్లో నటించి , తాజాగా *హీరో నాని నిర్మించిన “కోర్టు” సినిమా* ద్వారా హీరోగా అరంగ్రేటం,చేసి అతి చిన్న బడ్జెట్ చిత్రాన్ని హిట్గా మార్చి, అందరి మన్ననలను- అభినందనలు అందుకుంటున్న *భద్రాచలం కు చెందిన రోషన్ కి* హైదరాబాద్ లోని తన ఆఫీసుకి ఆహ్వానించి చిరు సత్కారం మరియు అభినందనలు తెలియజేసిన *టిపిసిసి సభ్యులు శ్రీ బుడగం శ్రీనివాస్*..
*భద్రాచలం ప్రముఖుల ప్రోత్సాహం…:*
రోషన్ ఎదుగుదలకి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు భద్రాచలం ప్రముఖుల అండదండలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది ఇందుకు కారణం భద్రాచలం పట్టణ ప్రముఖ కాంట్రాక్టర్ *హలీంఖాన్* వద్ద *రోషన్ తండ్రి రషీద్* ఒక సాధారణ అకౌంటెంట్గా పని చేస్తూ తన కుమారుడి టాలెంట్ ని అతి చిన్న వయసులోనే గుర్తించి,భద్రాచలం టౌన్ లోని *రాజేష్ తమ్మళ్ల డ్యాన్స్ మాస్టర్* వద్ద 4 సంవత్సరాల వయస్సు నుండే డాన్స్ లో మెలుకవలు నేర్పించారు..రోషన్ ని ఉన్నత స్టేజ్ లో చూడాలనే ఆశయం తో రషీద్ ఎంతో కష్టపడ్డాడు అందుకోసం అనేక రకాలుగా హలీం ఖాన్ దోహదపడ్డాడు అని స్థానికులు తెలుపుతున్నారు..
*బుడగం శ్రీనివాస్ ప్రత్యేక సత్కారం..:*
భద్రాచలం నివాసి రోషన్ హీరోగా తెరకెక్కిన కోర్టు సినిమా పెద్ద హిట్ సాధించడంతో బుడగం శ్రీనివాస్ హీరో మరియు తన తండ్రిని హైదరాబాదులో ఉన్న తన ఆఫీసుకి ఆహ్వానించి భద్రాచలం వాసులు ఇటువంటి సక్సెస్ సాధించటం గర్వకారణం మరియు అభినందించదగ్గ విషయంగా పరిగణిస్తూ అందుకు ప్రోత్సాహంగా కేక్ కట్ చేసి చిరు సత్కారం చేసి హీరో రోషన్ని మరియు తండ్రి రషీద్ ని బుడగం శ్రీనివాస్ శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బుడగం శ్రీనివాస్ గతంలోనే తనకు కళారంగo పట్ల ఉన్న మక్కుతో కళాకారులను ప్రోత్సహించాలని తత్వంతో ప్రస్తుతం టీవీ మరియు చలనచిత్ర రంగంలో టాప్ పొజిషన్లో యాంకర్ గా ఉన్న సుమాని మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ని ప్రొడ్యూసర్ గా సంకెళ్లు అనే టీవీ సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే..