+91 95819 05907

ఏళ్ళు నాటి సమస్యకు పరిష్కారం

-ఎమ్మెల్యే జారే చొరవతో సీసీ రోడ్ మంజూరు
-ఫలించిన స్థానిక నాయుడు కొల్లు చంద్రం కృషి, గ్రామస్తులు హర్షం…

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 31: ప్రజా సేవ చేయాలనే తపన, చేయించాలనే ఉత్సాహం ఉండాలే ఎలాంటి పని అయినా చిటికెలో జరిగిపోతుంది. మండల పరిధిలోని అచ్యుతాపురం ఏజెన్సీ పంచాయితి లో తట్టు కోళ్ళ నాగేశ్వరరావు ఇంటి నుండి పెద్ద నూతి చలక మీదుగా వేజల్ల మురళి ఇంటి వరకు ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా ఉన్న అంతర్గత వీధి సమస్యకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దాదాపు 60 ఏండ్లు ఉనికి గల ఈ పెద్ద నూతి చలక వీధికి ఎన్నో ఏండ్లుగా పంచాయితీ రోడ్ గా తీర్చిదిద్దాలని గత కాలం పాలక వర్గాలు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. గత అయిదేళ్లు పంచాయితీ సర్పంచ్ గా ఉన్న నాగలక్ష్మి భర్త కొల్లు చంద్రం గతంలో ఎమ్మెల్యే లకు, నేడున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు గ్రామం తరుపున ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందజేసారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పదించడంతో ఏండ్లు నాటి అంతర్గత దారి సమస్య పరిష్కారానికి నోచుకుంది. 120 మీటర్లు మేర గ్రామీణ ఉపాధి హామీ నిధులను కేటాయించి, రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ ను నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వీధిని సిద్ధం చేసారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అచ్యుతాపురం శాఖ అధ్యక్షులు కొల్లు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు జూపల్లి వెంకటేశ్వరావు, కొనకళ్ళ చెన్నారావు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర, తట్టుకోళ్ల సతీష్, కొనకళ్ళ శేఖర్, వంశీ, కామేష్, కిషోర్, రంగారావు, వెంకన్న బాబు ప్రభు యూత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !