నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ను ఆదుకోవాలని సదుద్దేశంతో 6000 కోట్ల బడ్జెట్ తో రాజీవ్ యో వికాసం తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు రాజు యువశక్తి పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో *రాజీవ్ యువ వికాసం పథకం* పై సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారంగా రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా పూర్తి చేసి *రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02* న మంజూరు పత్రాలు పంపిణీకి సిద్ధం అయ్యేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Post Views: 642









