+91 95819 05907

అశ్వారావుపేట నియోజకవర్గం దశబ్ద కాలం పాటు అభివృద్ధికీ దూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది

నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట:
అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పరకాల గండిలో రూ. 2.24 కోట్లతో అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో రూ. 3.10కోట్లతో, తిరుమలకుంటలో రూ. 3.15కోట్లతో, కావడిగుండ్లలో రూ. 2.24కోట్లతో, అశ్వారావుపేట పట్టణంలో రూ. 2.53కోట్లతో నూతనంగా చేపట్టబోయే 33/11 కెవి సబ్ స్టేషన్ ల శంకుస్థాపనకు, అదేవిధంగా రూ. 24.46కోట్ల అంచనా వ్యయంతో 33కెవి ఫీచర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గంలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ….

– అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది…అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం… అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో కరెంట్ వెలుగులు నింపేందుకు ఈ రోజు విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నాం

– వైఎస్సార్ హయాంలో ప్రతీ తండాకు, ప్రతీ గ్రామానికి నాణ్యమైన కరెంట్ తో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే

– గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది.

– ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.

– గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది.

– ఐనప్పటికీ వాటన్నిటిని తట్టుకుని వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఎన్నికల్లో ఇచిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నాం

– ఎవరికీ ఉపయోగపడని ధరణినీ పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగ పడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చాం

– విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నాం నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాజీవ్ యువ వికాస్ పేరుతో త్వరలోనే ప్రతీ నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది.

– గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, పాడుబడిన రైస్ మిల్లుల్లో ఉన్న గురుకులను పక్కన పెట్టీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.

– హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాం

– మనసుంటే మార్గం ఉంటుంది… పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం

– కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతుని రాజును చేశాం… రుణమాఫీని సక్రమంగా అమలు చేశాం, రైతు బంధు ఇచ్చాం. వర్షాకాలంలో సన్నాలకి బోనస్ ఇచ్చాం… యాసంగిలో కూడా ఇస్తాం

– గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 8లక్షల 19వేల కోట్ల రూపాయలకు మన ప్రభుత్వం ప్రతీ నెల రూ. 6500 కోట్లు అస్సలు, మిత్తి కడుతూ వస్తున్నాం…

– పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నాం

– మొదటి విడతలో ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఐటిడిఎ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

– గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత… మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నాం

– ఐ అండ్ పీఆర్ ద్వారా రూ. 1052కోట్ల రూపాయలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వినియోగించుకున్నారు.

– పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారని మనవి చేస్తున్నా

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

 Don't Miss this News !