నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : కే సీ దాస్ స్మారక సేవా సంస్థ మరియు హైదరాబాద్ కు ఆథ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన సనాతన ధర్మ వారధి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీ రామ చంద్రమూర్తి నిర్దేశంలో విశ్వ శాంతి కోసం , సనాతన ధర్మ పరిరక్షణ కోసం , భారత దేశ సర్వ సైనిక విజయ ప్రాప్యర్ధం తలపెట్టిన కోటి హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా శనివారం వైరా రోడ్డు నందు గల కోణార్క్ ఏసి ఫంక్షన్ హాల్ లో సుమారు 650 మంది భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగినది . ఈ కార్యక్రమం సనాతన ధర్మ వారధి సంస్థ ఆధ్వర్యంలో మరియు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ వారిధి సంస్థ ప్రతినిధులు డా॥ గోటేటి శశి కిరణ్ , డా॥ పసుమర్తి శ్రీనివాస్ , శివరాజు వెంకట సత్యనారాయణ , కందిబండ రమా మనోహర్ రావు , కందిబండ ప్రసాద్ మరియు ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్ , ఖమ్మం సత్యసాయి సంస్ధ కన్వీనర్ ఆలస్యం నరసింహారావు , గన్నవరపు ఆదినారాయణ , కోణార్క్ రెస్టారెంట్ అధినేత శ్రీ ప్రతాపని నరసింహారావు శైలజ దంపతులు , శ్రీ సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు , ప్రముఖులు దేవకి వాసుదేవరావు దంపతులు , బోనాల రామకృష్ణ , వేములపల్లి వెంకటేశ్వరరావు , ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , ఖమ్మం ఎసిపి మహముద్ , ఖమ్మం నగరం ట్రాఫిక్ సిఐలు సాంబశివ రావు , శేరి రాము తదితరులు పాల్గొన్నారు .









