+91 95819 05907

హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:

హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు Miss World -2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టు ముఖ్యమంత్రి గారు, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ గారు కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు.

తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ ప్రారంభం కాగా, 110 దేశాలకు చెందిన ప్రతినిధులు ర్యాంప్ పై ప్రదర్శనగా వచ్చారు. చివరలో మిస్ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకంతో కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా, వారి ధైర్య సాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ ప్రకటించారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా లంబాడా కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచంలోనే ఒకటైన పురాతన కళగా నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !