ఖమ్మం : ఖానాపురం హవేలీ టీ వి.రాజు అధ్యక్షతన పూలే అంబేడ్కర్ అధ్యయన వేదికలో మే 12న నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం నందు బౌద్ధ జయంతిని జరపాలని సమావేశం పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు పాల్వంచ రామారావు మాట్లాడుతూ ఖమ్మం పట్టణమునందు బౌద్ధ స్తూపం ఉండటం అనేది ఖమ్మం జిల్లాకే గొప్ప చరిత్ర అని ఆ చరిత్రను ఈ ప్రాంత ప్రజలకు తెలియపరచటంలో ఈ జిల్లా అధికార రాజకీయ యంత్రాంగం ఫెయిల్ అయిందని . ఇకనైనా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలని తద్వారా ప్రజలకు బుద్ధున్ని చరిత్ర తెలుస్తుందని అన్నారు . బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర నాయకులు పొడకండి రాంబాబు మాట్లాడుతూ బుద్ధుడు అష్టంగా మార్గాన్ని ఈ దేశం విస్మరించబట్టే బుద్ధుడి జ్ఞానాన్ని ప్రజలకు అందించకపోబట్టే ఇంకా ఈ దేశంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఈ దేశంలో పుట్టిన బుద్ధుణ్ణి ఈ దేశం నుండి తరిమి కొట్టడం వల్లనే ఈ దేశంలో హింస కొనసాగుతుందని అన్నారు . బుద్ధుడిని అడుగుజాడల్లో నడిచే దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని అన్నారు . ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నెలకొండపల్లిలో బౌద్ధ స్తూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తీర్చిదిద్దాలని అన్నారు . ఈ కార్యక్రమంలో బౌద్ధ నాయకులు రామకృష్ణ , బీసీ జేఏసీ నాయకులు చిట్టోజు రమేష్ , జి కోటేశ్వరరావు , ఎలగందుల రాధాకృష్ణ తదిరులు పాల్గొన్నారు .









