రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 11:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శారద ఫంక్షన్ హాల్ లో రామాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1973 -74 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం నాడు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ అనుభవాలతో పాటు పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు. ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కావడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు.తమకు విద్యను బోధించిన గురువు వెంకటేశ్వరరావును శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.గురువులు నాడు సూచించిన మార్గంలో నడవడం పట్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని గురువులను కొనియాడారు.నేటి యువతకు ఆతరం గురువులు ఆదర్శంగా ఉంటారని అన్నారు.ఈ సమ్మేళనం ఒక పండగను తలపించే విధంగా ఎంతో ఆనందంగా ఆప్యాయంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.









