రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి కొనుగోలుకు సంబందించిన రిజిస్టర్లను పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంకు తేమశాతం రాగానే కొనుగోలు ప్రక్రియ మొదలవ్వాలని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలు,రైతుల ఖాతా వివరాలను ఎలాంటి ఆలస్యం కాకుండ ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.అకాల వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని సరిపడా టార్ఫాలిన్ లను,గన్ని సంచులను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి అనుగుణంగా లారీలను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.అయన వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మండల తహసీల్దార్ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.









