+91 95819 05907

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తోలుతే కఠిన చర్యలు

పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్

పినపాక

పినపాక మండలంలో ప్రభుత్వ ఆనుమతి లేకుండా ఇసుక, మట్టి రవాణా చేసినా, డంపింగ్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్, రెవిన్యూ అధికారి రమేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీస్‌శాఖ సహకారంతో దాడులు నిర్వహిస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా ఉండడానికి చెక్ పోస్ట్ లు పెట్టినా కూడా మండలంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక, మట్టిని ట్రాక్టర్ యజమానులు గుట్టు చప్పుడు కాకుండా తోలుతున్నారని సమాచారం అందింది అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో నరేష్ తెలిపారు. అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో, మైనింగ్ అధికారుల అనుమతులు ఉన్నవారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి, విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అనుమతులు లేని వారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు పట్టా పొలాలు (భూములు) ఉన్నా కానీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు కి తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రం తీసివేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి తెలిసిన వారు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !