రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పక్షం రోజులపాటు నిత్యం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా నేడు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు, చిత్రలేఖనంలో మెళకువలు, కథలు, పొడుపు కథలలో శిక్షణ ఇచ్చారు.ఆసక్తిగల విద్యార్థులకు షటిల్, వాలీబాల్, క్యారమ్స్ వంటి ఆటలలో కూడా శిక్షణ పొందుతున్నారు.ఆసక్తిగల వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఉంటే నేరుగా బాలికల పాఠశాలలో ఈ శిక్షణ పొందవచ్చని శిక్షకులు మద్దెల భరత్ తెలియపరచారు.
Post Views: 65









