★వలస ఆదివాసీలను పట్టించు కోని మంత్రి సీతక్క
★తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
వలస ఆదివాసి గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వలస ఆదివాసి గ్రామాలలో, ఆదివాసులు బ్రతకటానికి అవసరమైన మౌలిక వసతులు (త్రాగునీరు,కరెంటు రోడ్లు, విద్య, వైద్యం) లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.తనను గెలిపిస్తే ఆదివాసీ గూడెలలో అన్ని వసతులు కల్పిస్థానని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని, గెలిచి అధికారంలోకి వచ్చి మంత్రి అయిన తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆదివాసీలను రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయి, తప్ప వారిని కనీసం మనుషులుగా పరిగణించటం లేదని విమర్శించారు. ఏజెన్సీ చట్టాల పరిధిలో ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పిస్తూ, వారికి కనీస మౌలిక వసతులు కల్పించి, వారిని ఆదుకోవాలని కోరుతూ పిఓ గారిని కోరారు. ఈ కార్యక్రమం లో సోడి అర్జున్, అదిబాబు, దేవా,జోగయ్య తదితరులు పాల్గొన్నారు.









