*రోడ్ల విస్తరణ పనులు మళ్ళీ మొదటికే….?*
నేటి గద్దర్ అల్లూరి జిల్లా ప్రతినిధి :
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నా జిల్లా కేంద్రంలో మాత్రం రోడ్ల విస్తరణ పనులు రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లా ఏర్పడ్డప్పటి నుండి గత కలెక్టర్లు పాడేరు జిల్లా కేంద్రంలో రోడ్లు విస్తరణ పనులు వేగవంతం చేయాలని హడావిడి చేస్తూ అఘమేఘలు మీద సర్వే చేస్తూ ముందుకు సాగే క్రమంలో ఏదో రకంగా అవరోధాలు ఏర్పడి రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువై విస్తరణ పనులు జరగకుండా ఇన్నాళ్లు నత్తనడకన కొనసాగింది. కాగా ఇదివరకు సర్వోన్నత న్యాయ స్థానం రోడ్ల విస్తరణ పనులు 8 వారాల్లో పూర్తి చేయాలని ఇరు వైపుల ప్రభుత్వ, ఆర్ అండ్ బి స్థలాలు ఆక్రమణలు గుర్తించి 50+50 చొప్పున విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నపటికీ అల్లూరి జిల్లా కేంద్రంలో మాత్రం రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ళ తో అధికార్లు సతమతం అవుతూ ముందుకు సాగలేక పోతున్నారు. గిరిజన హక్కులు చట్టాలను కాల రాస్తూ ప్రధానంగా గిరిజనేతరుల పక్షాన మాజీ ఎమ్మెల్యే గిడ్డి. ఈశ్వరి నిలబడి నేరుగా జిల్లా కలెక్టర్ పై మరింత ఒత్తిళ్లు తీసుకొని రావడం 50+50 చేయడానికి మేము అంగీకరించమని పరోక్షంగా జిల్లా కలెక్టర్ కు బెదిరించడంతో మాకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు గానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ 30+30 వరకే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని అధికార్లకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై గిరిజన సంఘాలు,
ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నిరుద్యోగ యువకులు, దుమ్మెత్తి పోస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ప్రస్తుత అధికార ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు పుల్ సపోర్ట్ చేసినా పట్టించు కాకుండా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒత్తిళ్ళకు తల్లొగ్గి రోడ్ల విస్తరణ పనులు కుదించడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పాడేరు పట్టణ ప్రజల కష్టాలు, సుదూర ప్రాంతాల్లో నుండి వస్తున పర్యాకటకుల దృష్ట్యా వాహన రద్దీ, వి ఐ పి ల రాకపోకలు, ట్రాపిక్ సమస్య లేకుండా, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు పట్టించు కో కుండా 50+50 విస్తరణ పనులు పూర్తి చేయాలని అన్ని రంగాల వారు కోరుతూన్నారు. అధికార్లు ఈ ప్రాంతంలో శాశ్వతం కాదని, కానీ అభివృధి చేసి వెళ్ళిపోయిన అధికార్లు గిరిజన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండి పోతారని పలువురు వ్యక్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి కైన జిల్లా కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పింది చేస్తారో లేక ప్రజల శ్రేయసు కోరి రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేస్తారో వేచి చూడాల్సిందే.









