నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధి లోని మారెమ్మ తల్లి దేవాలయం నందు ఐ ఎన్ టీ యు సి కమల మెడికల్ ఆటో వర్కర్స్ యూనియన్ వనభోజన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు పూల బొకే మరియు శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మద్దులపల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఐ ఎన్ టీ యు సి జిల్లా అధ్యక్షులు కొత్త.సీతారాములు,కార్పొరేటర్ కమర్తపు.మురళి,ఆటో వర్కర్స్ యూనియన్ పార్లమెంటరీ అధ్యక్షులు పాల్వంచ.కృష్ణ పాల్గొని డ్రైవర్లకు పలు సూచనలు మరియు సలహాలు పాటించాలని అలాగే ఆటో యూనియన్ వారికి మనోధైర్యం కల్పించి ఎల్ల వేళలు అండగా ఉంటామని వారిని ఉద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమానికి వారితో పాటు ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు బానోత్.కిషోర్,బానోత్.హరి,ఆటో యూనియన్ నాయకులు,డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు









