*•అభివృద్ధికి రాజకీయ నాయకుల జోక్యం, ఆధిపత్యం సరైనది కాదు !*
*•పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు
నేటి గద్దర్ అల్లూరి జిల్లా పాడేరు ప్రతినిధి:
*1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం నియమాలు అమలు లో ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లా 5వ షెడ్యూల్ ప్రాంత పరిధి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అల్లూరి జిల్లాలోని పలు ప్రధాన కేంద్రాల్లో రోడ్డు విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలు తొలగింపు కోసం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకు 100 అడుగులు వెడల్పు చేయాలని పాడేరు శాసన సభ్యులు వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు*
పాడేరు జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతున్నాయని అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ జామ్ అయి రోగులు సైతం సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. గిరిజన ప్రాంత వాసులు అందరూ అభివృధి కోరుకుంటున్నారని పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణ చూసుకుని పలు రాజకీయ పార్టీల నాయకులు గిరిజన పట్టణ ప్రాంత అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నాయకులు రోడ్లపై స్వచ్ఛందంగా వచ్చి మీ వైఖరి తెలియజేయాలని
జిల్లా కలెక్టర్ మీపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ రోడ్డు ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులు ఆగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పాడేరు శాసన సభ్యులు కోరారు. లేని పక్షంలో స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.









