+91 95819 05907

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు మే నెల పెండింగ్ వేతనం చెల్లించాలి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు

*హనుమకొండ జిల్లా*
*13 జూన్ 2025*

నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన 2025 మే నెల వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న 7 నెలల పీ.ఆర్.సీ. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగులతో కలిసి హనుమకొండ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. అల్లం.అప్పయ్య కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం క్యాడర్లను ఏర్పాటు చేయడం జరిగినదని, పనికి తగిన క్యాడర్ నిర్ణయించి దానికి సమానమైన మూల వేతనాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగికి వారి ఇంటిలో కుటుంబ సభ్యులందరికి వర్తించే విధంగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య ను రాష్ట్ర నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆచంటి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !