*పేకాట స్థావరాలపై పోలీసుల దాడి*
నేటి గదర్ న్యూస్,పినపాక:
పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన పినపాక మండలం ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డి.ఎస్.పి రవీందర్ రెడ్డి గారి ఆదేశాలతో సిఐ వెంకటేశ్వరరావు సూచనలతో ఎస్సై రాజకుమార్, తన సిబ్బందితో కలిసి పినపాక మండలం పరిధిలోని టీ కొత్తగూడెం గ్రామ సమీపంలోని పేకాట ఆడుతున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5,100 నగదు,5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.మరో నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ తీసుకురాగా పారి పొయ్యారు.8 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Post Views: 553









