రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 13:- ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి డి రాధా కిషన్ పాల్గొన్నారు.గ్రామంలో బడి ఈడు పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అందుకోసం ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులతో కలిసి సహకరించాలని,ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు కూడా సూచించారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల విద్యాధికారి సాంగని యాదగిరి ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీటీసీ బాల్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ రమేష్,విలేజ్ సెక్రటరీ వెంకట నరసింహారెడ్డి ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్ ఉపాధ్యాయ సిబ్బంది మోహన్ మమత నవీన్ రత్నాకర్ జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 221









