ప్రగతి ధర్మారంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రాథమిక పాఠశాల హరిజన వాడలో శుక్రవారం రోజు మండల ఎంఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలలో చేరినటువంటి మొదటి తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు దుస్తులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్,అతిథులుగా జయపాల్ రెడ్డి,రాజేశ్వర్ శర్మ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్,సిద్ధరాములు,ఉపాధ్యాయ బృందం,ఏఏపిసి చైర్మన్ రేణుక రోజా,అంగన్వాడీ టీచర్లు గ్రామ కార్యదర్శి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 92









